Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మహిళపై సెక్యూరిటీగార్డు లైంగికదాడి

సుస్తి చేస్తే బాగు చేయాల్సిన దావఖానాల్లోనే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మహిళపై ఓ సెక్యూరిటీ గార్డు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోగికి సహాయంగా ఉం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (08:34 IST)
సుస్తి చేస్తే బాగు చేయాల్సిన దావఖానాల్లోనే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మహిళపై ఓ సెక్యూరిటీ గార్డు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోగికి సహాయంగా ఉండేందుకు వెళ్లగా, ఈ దారుణం జరిగింది. ఈ విషయం తెలిసిన సహచర సెక్యూరిటీ సిబ్బంది ఈ దారుణాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే, బాధితురాలు నోరు తెరవడంతో ఈ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి సహాయంగా ఉండేందుకు ఓ మహిళ(35) వెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటాక అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డు ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. గాంధీ మెడికల్‌ కాలేజీ ఎదురుగా ఉన్న క్రీడా మైదానంలో లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఇద్దరి మధ్య డబ్బు విషయంలో తలెత్తిన గొడవతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సెక్యూరిటీగార్డు తన స్నేహితులతో చెప్పినట్టు తెలిసింది. బాధితురాలు ఆస్పత్రిలోని పోలీస్‌ ఔట్‌పోస్టులో ఆదివారం ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం