Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధారామాలకు వెళ్లిన ఆ జంట.. చాలాసేపటికి తిరిగి రాలేదు.. వెళ్ళి చూస్తే?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:31 IST)
బౌద్ధరామాలకు పర్యటనకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతోపాటు వచ్చిన యువకుడు తీవ్రగాయాలతో అక్కడే పడి ఉండటం గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను పరిశీలిస్తే, ఎల్లప్పుడూ రద్దీగా ఉండే పర్యాటక స్థావరం గుంటుపల్లి బౌద్ధారామాలను ఆదివారం మధ్యాహ్నం 40 మంది పాఠశాల విద్యార్థులు సందర్శించారు.

వారితోపాటు మరో మూడు జంటలు కొండపైకి వెళ్లినట్లు సిబ్బంది చెప్పారు. కొంతసేపటికి విద్యార్థులు, రెండు జంటలు తిరిగి వచ్చేశారు. కానీ ఒక జంట మాత్రం చాలాసేపు రాకపోవడంతో సిబ్బంది వెతకడానికి వెళ్లారు. అక్కడ ఓ యువతి బట్టలు లేకుండా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. 
 
తీవ్ర గాయాలై రక్తం చెట్లకు కూడా అంటుకుని ఉంది. ఆమెతోపాటు యువకుడు కూడా ప్రక్కనే తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి ఆమెపై అత్యాచారం చేసి ఈ దుర్ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసారు.

యువకుడు నవీన్‌ భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద యువకుడు గాయాలతో పడి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments