Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడు మోజులో భర్తను చంపిన భార్య... కాబోయే ఎస్.ఐ జైలుపాలైంది

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:45 IST)
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అల్లుడు మోజులో కట్టుకున్న భర్తను హత్య చేసింది. కేవలం అల్లుడుతో భర్తకు సాగిస్తున్న శారీరక సంబంధాన్ని తెంచుకోమన్నందుకు ఈ దారుణానికి పాల్పంది. అంతేకాకుండా, భర్త ఆస్తిని తన పేరున మార్చుకుని, ఆ తర్వాత అల్లుడని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పనికి పాల్పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఓ రైల్వే ఉద్యోగి మృతదేహాన్ని హైదరాబాద్ బోరబండ రైల్వే ట్రాక్ పక్కన ట్రాక్ సిబ్బంది గుర్తించారు. దీనిపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
సనత్ నగర్‌కు చెంది సంగీత అనే మహిళ తమ ఇంట్లోనే ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న అల్లుడు విజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది రెండు మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించి, విజయ్‌ను ఇంటినుంచి వెళ్లగొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న సంగీత.. అల్లుడు విజయ్, అతని మిత్రుల సహకారంతో భర్త శ్రీనివాస్‌ను హత్య చేసింది. 
 
ఆ తర్వాత మృతదేహాన్నిచాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల జాగిలాలు మాత్రం అసలు నిందితులను పట్టించడంతో సంగీత, విజయ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిజానికి సంగీత.. ఇటీవల జరిగిన ఎస్.ఐ పరీక్షల్లో అర్హత సాధించింది. ఈమెకు త్వరలోనే ఎస్.ఐ పోస్టు రానుంది. అయితే, రైల్వే ఉద్యోగి అయిన శ్రీనివాస్ అక్క కొడుకు విజయ్.. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. అల్లుడి వరసైన విజయ్‌తో సంగీత… వివాహేతర సంబంధం నడిపింది. చివరకు అతని దూరంగా ఉండలేక, ఏకంగా భర్తనే హత్య చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments