Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై కన్నేసిన 60 ఏళ్ల పెద్దమనిషి.. ప్రతిఘటించిందని గొడ్డలితో..?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (15:28 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నాపెద్దా తేడాలు లేకుండా కామాంధులు మహిళలపై విరుచుకుపడుతున్నారు. ఇలా అందంగా కనిపించిన మహిళపై ఓ 60 ఏళ్ల వృద్ధుడి కన్నుపడింది. ఈ ఘటనలో ఓ 42 ఏళ్ల మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మికి 42 ఏళ్లు. వ్యవసాయ కూలీల కోసమని ఆ గ్రామంలో తిరుగుతు ఉంది. అంతలోనే అదే గ్రామానికి చెందిన వల్లెపు ఓబయ్య అనే ఓ 60 ఏళ్ల వ్యక్తి ఆ మహిళతో మాటా మాటా కలిపాడు.
 
దీంతో కామంతో ఊగిపోతున్న ఆ దుర్మార్గుడు ఆ మహిళ కాళ్లనొప్పులతో బాధపడుతున్న విషయాన్ని పసిగట్టాడు. దీంతో వెంటనే నా వద్ద మందులు ఉన్నాయని, వేసుకుంటే నొప్పులు తగ్గుతాయని చెప్పాడు. ఇదే నిజమేనని నమ్మిన ఆ వివాహిత అతని వెంటనే ఇంట్లోకి వెళ్లింది. వెంటనే తలుపులు మూసిన ఆ పెద్దాయన ఆ వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ప్రటిఘటించిన మహిళ అరుపులు కేకలతో అల్లరి చేసింది.
 
దీంతో ఏం చేయాలో తెలియని ఓబయ్య కాళ్లను, చేతులను కట్టేసి గొడ్డలితో అతి కిరాతకంగా నరికాడు. ఇక ఇదే విషయాన్ని ఆ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీసుల వద్ద నున్న దుర్మార్గుడు ఓబయ్యను లాగి తీవ్రంగా చితకబాదారు. గ్రామస్తులు విచక్షణ రహితంగా కొట్టడంతో ఓబయ్య అక్కడికక్కడే మరణించాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments