Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ కైలాసగిరిపై మహిళ గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:00 IST)
విశాఖపట్టణంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో మహాపచారం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ మహిళను నలుగురు యువకులు పట్టుకుని అత్యాచారం జరిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కూడా నిర్ధారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, 18 యేళ్ళ వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తర్వాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ పిమ్మట తన తన స్నేహితులు ముగ్గురిని (అందులో ఇద్దరు మైనర్లు, మరొకరు గురివిల్లి రమణ) రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రతలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు... ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో వున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ నిందితులంతా జోడుగుళ్ళపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం