Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమిత్ షాతో అసంపూర్తిగా జగన్ భేటీ.. అర్థాంతరంగా ముగిసిన ఢిల్లీ టూర్

అమిత్ షాతో అసంపూర్తిగా జగన్ భేటీ.. అర్థాంతరంగా ముగిసిన ఢిల్లీ టూర్
, మంగళవారం, 22 అక్టోబరు 2019 (15:03 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సుమారు 45 నిమిషాలసేపు చర్చ జరిగింది. ఇందులో ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు,
వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్‌షాతో జగన్ చర్చించారు.
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్న సీఎం.. వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదాద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని హోంమంత్రికి వివరించారు. చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలని కోరారు. 
 
2014-2015లో రెవిన్యూలోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారంటూ అమిత్‌షాకు గుర్తు చేశారు. ఆమేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18969.26 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చెల్లించాల్సి ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకు వచ్చిన సీఎం. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించాలని కోరిన సీఎం. 
 
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్‌ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం అంశాన్ని పేర్కొన్న సీఎం. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా ప్రస్తావించిన ముఖ్యమంత్రి. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి. 
 
వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలని హోంమంత్రిని కోరిన ముఖ్యమంత్రి ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000ఇస్తున్నారన్న సీఎం. ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలన్న శ్రీ వైయస్‌.జగన్‌ ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఏడాదికి రూ. కోట్లు చొప్పున ఇప్పటివరకూ రూ.2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలన్న సీఎం.
 
 
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్‌షాకు విజ్ఞప్తిచేసిన సీఎం. ఇందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కే ఖర్చు అవుతుందన్న సీఎం. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరిన సీఎం. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాలన్న సీఎం. 

వీలైనంత త్వరలో నిధులు ఇవ్వడానికి సంబంధిత మంత్రిత్వశాఖను కోరాలంటూ విజ్ఞప్తిచేసిన ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదాచేశామని అమిత్‌షాకు తెలిపిన సీఎం. హెడ్‌ వర్క్స్‌, హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించిన ముఖ్యమంత్రి. 
 
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని అమిత్‌షాతో చర్చించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. కృష్ణానదిలో గడచిన 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని వివరించిన సీఎం. మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయన్న సీఎం. 
 
కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరదజలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరిన సీఎం. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారుతాయని వివరించిన సీఎం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిగ్రీ పట్టా కోసం 8 మంది డూప్‌లు.. ఎంపీని సస్పెండ్ చేసిన వర్శిటీ!