Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితను వాడుకుని బ్లాక్ మెయిల్..

Webdunia
శనివారం, 30 జులై 2022 (10:24 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మోసాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కెలు తీర్చుకుని బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పార్వతి టైలరింగ్‌ చేస్తూ బీకేగూడ ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటోంది. భర్తతో విడిపోయిన ఆమె కూతురుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం చందానగర్‌లో ఉన్న సమయంలో అమర్‌తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని నీ కూతురుని కూడా బాగా చూసుకుంటానని నమ్మించి ఆరు నెలలపాటు ఆమెతో సహజీవనం చేశాడు. 
 
అయితే అమర్‌తేజకు సైతం వివాహం జరిగినట్లు తెలియడంతో ఆయనను నిలిదీసింది. దీన్ని మనుసులో పెట్టుకుని ఆమెను వేధింస్తుండటంతో బాధితురాలు చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరియీ కౌన్సిలింగ్‌ చేసి పంపారు. అయినా అతడిలో మార్పు రాలేదు. 
 
గతంలో ఆమెతో ఉన్న సమయంలో దిగిన ఫొటోలను చూపించి తనవద్దకు రావాలని, లేదంటే ఫొటోలను మీ బంధువులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments