Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పిచ్చాడు.. కూల్‌డ్రింక్స్ తాగించి అత్యాచారం... ఆపై ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్

ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఓ మహిళకు అప్పించిన ఓ కామాంధుడు.. ఆమెను ఇంటికి పిలిపించి కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ బెయిల్ చేశాడు.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (08:57 IST)
ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఓ మహిళకు అప్పించిన ఓ కామాంధుడు.. ఆమెను ఇంటికి పిలిపించి కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ బెయిల్ చేశాడు. ఆ తర్వాత కల్యాణదుర్గం తీసుకెళ్లి ఒక గదిలో ఉంచి పలుసార్లు లైంగికదాడికి పాల్పపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. లక్ష రూపాయల అప్పు కోసం స్నేహితులను సంప్రదించగా వారు సమకూర్చలేక పోయారు. అయితే, ఓ స్నేహితురాలి ఇచ్చిన సలహా మేరకు అనంతపూర్‌లో మెడికల్‌షాపు యజమాని కొమర్‌శెట్టిని సంప్రదించింది. 
 
కొద్దిరోజుల తర్వాత ఆమెకు ఆయన రూ.లక్ష అప్పిచ్చాడు. ప్రతినెలా వడ్డీ చెల్లించడంతోపాటు యేడాది తర్వాత అసలు మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. కొమర్‌శెట్టి 2016 నవంబర్‌లో ఆమెకు డబ్బు ఇచ్చాడు. రెండు రోజులు గడిచిన తర్వాత అప్పుకు సెక్యూరిటీ సంతకాలు చేసేందుకు ఇంటికి రావాలంటూ కబురు పెట్టడంతో ఆమె ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను మాటల్లోకి దించి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. 
 
ఈ డ్రింక్ తాగిన వెంటనే ఆమె మత్తులోకి జారుకోగానే ఆమెపై లైంగికదాడి చేశాడు. వివస్త్రగా ఉన్న ఫొటోలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. మహిళకు మెలకువ వచ్చాక జరిగిన అన్యాయం గురించి తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా కొమర్‌శెట్టి సెల్‌ఫోన్‌లో ఫొటోలు చూపించాడు. ఫిర్యాదు చేస్తే వాటిని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి తనతో అనంతపూర్‌ రావాలని ఆమెను కోరాడు. 
 
అతని బెదిరింపుల మేరకు అనంతపూర్‌ వెళ్లగా, అక్కడ నుంచి కళ్యాణదుర్గంలో ఓ గది తీసుకొని అందులో ఆమెను ఉంచి పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత ఆ కామాంధుడి కళ్లుగప్పి నగరానికి చేరి ఈనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు లేవు లెండి.. పూనమ్ కౌర్ వ్యంగ్యాస్త్రాలు

కొత్త ఏడాది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో షురూ కానుందా !

సీఎం ఆఫర్ వచ్చింది.. సున్నితంగా తిరస్కరించా : సోను సూద్

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments