Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను 35 సార్లు కత్తితో పొడిచాడు.. అడ్డొచ్చిన కొడుకుని కూడా.. ఎందుకంటే..?

అనుమానం పెనుభూతమైంది. తన భార్య పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇక అంతే.. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగుల

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (08:43 IST)
అనుమానం పెనుభూతమైంది. తన భార్య పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇక అంతే.. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌కు చెందిన బినోద్ బిష్ట్‌ అనే వ్యక్తికి భార్య రేఖతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. ఓ కేటరింగ్ సంస్థలో మేనేజరుగా పనిచేసే బినోద్ భార్య ఓ యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. భార్యతో బినోద్ గొడవపడుతున్నపుడు అతని సోదరుడు కూడా అదే ఆవరణలోని మరో ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఆ ఫ్లాట్‌కు బినోద్ బయట నుంచి గడియపెట్టాడు. 
 
ఆపై భార్యను తిడుతూ కత్తి తీసుకొని 35 పోట్లు పొడిచాడు. అంతలో పక్కగదిలో నిద్రపోతున్న బినయ్ కుమారుడు వినీత్ అడ్డుకోబోగా అతన్ని కూడా కత్తితో పొడిచాడు. తీవ్రగాయాల పాలైన తల్లీ, కుమారులను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి మరణించింది. కుమారుడు వినీత్ కోలుకుంటున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments