Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లాడిందనీ విహహితను గొంతుకోసి చంపేశారు...

తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని తీపనూరు గ్రామానికి

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (11:24 IST)
తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని తీపనూరు గ్రామానికి చెందిన కాటూరు అశోక్‌ అనే వ్యక్తితో ఓడూరుకు చెందిన షర్వాణీ (28) అనే యువకితి యేడాదిన్నర క్రితం వివాహమైంది. షర్వాణీ ఓడూరు రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌ ఉమన్‌గా పని చేస్తుండగా, అశోక్ గూడురులోని ఓ కంపెనలో పని చేస్తున్నాడు. 
 
అయితే, అశోక్‌‌కు పెళ్లికాకముందే వింజమూరుకు చెందిన మౌనికతో పరిచయం ఉంది. అశోక్‌కు షర్వాణీతో వివాహం జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. ఎలాగైనా ఆమెను అతనికి దూరం చేసి, తాను దగ్గర కావాలని మౌనిక ప్రయత్నిస్తూనే ఉంది. అవేమీ ఫలించక పోవడంతో షర్వాణీని హతమార్చాలని ప్లాన్ వేసింది. 
 
ఈ క్రమంలో షర్వాణీ రెండు రోజుల క్రితం డ్యూటీ ముగించుకుని ఓడూరులోనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి అశోక్ తమ్ముడు కూడా ఆ ఇంటికి వెళ్ళగా, తలుపులు వేసివున్నాయి. దీంతో ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలోనుంచి చూడగా షర్వాణీ రక్తపుమడుగులో పడివుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 
 
అవేవీ ఫలించకపోవడంతో షర్వాణీ హత్యకు పథకం రచించింది. శుక్రవారం మధ్యాహ్నం ఓడూరులోని తన తల్లి వద్దకు షర్వాణీ వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షర్వాణీ మరిది సంతోశ్‌ అక్కడకు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటికిలోంచి చూడగా రక్తపు మడుగులో షర్వాణీ పడివుంది. అతడు చూసేటప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. 
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా భర్త అశోక్‌ను ప్రశ్నించగా, తనకు గతంలో మౌనిక అనే యువతితో పరిచయం ఉందని, ఆమె తన తల్లి పద్మావతితో కలిసి హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశాడు. వారిద్దరిని వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments