Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (09:49 IST)
ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో జంపింగ్ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత రెండు రోజల వ్యవధిలోనే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అలాగే, ఇపుడు మరో సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మొన్నటికిమొన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అలాగే, నిన్నటికి నిన్న అనకాపల్లి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా తన ఎంపీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరారు. 
 
ఇదేబాటలో మరికొంతమంది టీడీపీ నేతలు పయనించనున్నారనే వార్త ఇపుడు హల్‌చల్ చేస్తోంది. ఇలాంటివారిలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సామాజికవర్గం ఆధిపత్యంలో ఇమడలేక రెడ్డి, కాపు, ఇతర వర్గాలకు చెందిన నేతలు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు. 
 
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి... తన అనుచరులతో నెల్లూరులో సమావేశం నిర్వహించారు. దీనికి ముందుగానే ఆయన పలు సర్వేలు కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన తన పోటీకి సంబంధించి సర్వే రిపోర్టుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారని... ఈ కారణంగానే అనుచరులతో సమావేశమయ్యారని ఒంగోలు, నెల్లూరు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. 
 
మాగుంట అనుచరులు కొందరు ఆయనను వైసీపీ తరపున ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతుంటే... మరికొందరు మాత్రం టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగాలని కోరుతున్నారు. దీనిపై ఆయన ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశం జరుగుతుండగానే సీఎం చంద్రబాబు నుంచి మాగుంటకు ఫోన్ వచ్చింది. తక్షణం అమరావతికి వచ్చి తనను కలవాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో... మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బపడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments