Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడే సర్వస్వం అనుకుంది, కొడుక్కి ఆస్తి ఆశ చూపి భర్తను చంపేసింది

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (16:36 IST)
అక్రమ సంబంధాలు జీవితాలను సర్వనాశనం చేసేస్తున్నాయి. వావివరుసలు మర్చిపోయి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. అలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. భర్త కన్నా ప్రియుడే సర్వస్వం అనుకుంది ఆ భార్య. కొడుకిని తనవైపు తిప్పుకుని ఆస్థి ఎరచూపింది. ఇంకేముంది ఇద్దరూ కలిసి అతి దారుణంగా చంపేశారు.
 
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం గుండ్లసాగరానికి చెందిన జంట. కర్ణాటక సరిహద్దు గ్రామమైన ఎర్రవంకులో శంకర్, రాజేశ్వరి నివాసముండేవారు. వీరికి కొడుకు అరుణ్ ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉన్నాడు.
 
రాజేశ్వరికి స్థానికంగా ఉన్న శివకుమార్‌తో అక్రమ సంబంధం ఉంది. ఇది గత నాలుగు సంవత్సరాలుగా సాగుతోంది. ఈ విషయం కొడుక్కి తెలుసు. అయితే తల్లి విషయాన్ని తండ్రికి చెప్పేవాడు కాదు అరుణ్. శంకర్ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి బాగా ఉండేది.
 
భర్తతో విసిగిపోయిన రాజేశ్వరి ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. కొడుక్కి ఆస్థి ఎరచూపింది. నీ తండ్రి చనిపోతే ఆస్థి మొత్తం నీకు.. నాకే వస్తుంది. మనం బాగా ఎంజాయ్ చేయొచ్చని చెప్పింది. శంకర్ అసలు డబ్బులు ఖర్చు పెట్టేవాడు కాదు. 
 
ఆస్తి ఉన్నా అనుభవించలేకపోతున్నామన్న బాధతో అరుణ్ ఒప్పుకున్నాడు. తల్లి ప్లాన్‌కు సహకరించాడు. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని ఇద్దరూ కలిసి అతని ముఖంపై దిండు వేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తరువాత గుండెపోటుతో చనిపోయాడని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశారు.
 
కానీ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడితే భార్యను విచారించారు. దీంతో నిజం ఒప్పుకుంది. కటాకటాల పాలైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments