Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో బైకు కోసం గొడవ.. భార్య ఆత్మహత్య...

Webdunia
మంగళవారం, 19 మే 2020 (14:59 IST)
లాక్ డౌన్ కారణంగా భర్తతో ఏర్పడిన ఘర్షణ ఓ గృహిణి ఆత్మహత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. అస్సోం రాష్ట్రానికి చెందిన మిథున్‌దత్త, అనిదత్త(24) దంపతులు మూడేళ్ల క్రితం వలస కూలీలుగా హైదరాబాద్ నగరానికి వచ్చారు. మిథున్‌దత్త బోయినపల్లిలోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. 
 
మిథున్‌ దత్త బైక్‌ను గ్రామంలో ఉన్న అనిదత్త అన్నయ్య వాడుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ బైక్‌ మిథున్‌దత్త అన్నయ్యకు అవసరం పడింది. ఆ బైక్‌ను తన అన్నయ్యకు ఇవ్వాలని మిథున్‌దత్త భార్యకు తెలిపాడు. దీనిపై వారం రోజులుగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఆదివారం రాత్రి గొడవ పెద్దది కావడంతో మనస్తాపానికి గురైన అనిదత్త గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఎంతసేపటికీ భార్య బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన భర్త లోనికి వెళ్లిచూడగా రాడ్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments