Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం అమెరికాకు చెందినవారిమేనా? శ్రీనివాస్ సహచరి ప్రశ్న

అమెరికాలో నివసించడంపై తనకు సందేహాలు ఉండేవని శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో చనిపోయిన శ్రీనివాస్ కూచిబొట్ల జీవన సహచరి సునయన దాముల పేర్కొన్నారు. శుక్రవారం అమరికాలోని ఒలాతే ప్రాంతంలో తన భర్త పనిచేస్తుండిన గార్మిన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో మీడియా సదస్సులో

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (09:45 IST)
అమెరికాలో నివసించడంపై తనకు సందేహాలు ఉండేవని శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో చనిపోయిన శ్రీనివాస్ కూచిబొట్ల జీవన సహచరి సునయన దాముల పేర్కొన్నారు. శుక్రవారం అమరికాలోని ఒలాతే ప్రాంతంలో తన భర్త పనిచేస్తుండిన గార్మిన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో మీడియా సదస్సులో పాల్గొన్ని సునయన దివంగతుడైన భర్త శ్రీనివాస్ గురించి మాట్లాడారు. తనకు చాలా కాలం నుంచే మనం ఈ దేశానికి చెందినవారిమేనా అనే సందేహం ఉండేదని, అమెరికాలో మంచి జరుగుతుందని తన భర్త తనకు ధైర్యం చెప్పాడని సునయన్ తెలిపారు.
 
జీపీఎస్ పరికరాల తయారీ సంస్థ గార్మిన్ నిర్వహించిన సదస్సులో సునయన మాట్లాడారు.  అమెరికాలో జాతి వివక్షకు సంబంధించిన వార్తలు మైనారిటీలను భయపెడుతున్నాయని, అందుకే తన భర్తను తాను మనం ఈ దేశానికి చెందినవారమేనా ఆని అడిగానని సునయన చెప్పారు. ఇప్పుడు తన భర్తనే పోగొట్టుకున్న తర్వాత మైనారిటీలపై విద్వేషపు దాడులను అమెరకా నిలువరించగలదా అని తనకు సందేహం కలుగుతోందని సునయన్ అన్నారు. 
 
మైనారిటీలపై తరచుగా జరుగుతున్న కాల్పుల ఘటనలను విని భయపడే తాను మనం ఈ దేశంలోనే ఉండాలా అని ప్రశ్నించానని దానికి తన భర్త సమాధానమిస్తూ అమెరికాలో మంచి విషయాలు జరుగుతాయని సర్ది చెప్పారని సునయన తెలిపారు..
 
కాగా కాల్పుల ఘటన జరిగిన కన్సాస్ ప్రాంతంలోని భారతీయులు ట్రంప్ పేరిత్తితేనే మండిపడుతున్నారు. మైనారిటీల రక్తంలో ట్రంప్ చేతులు ముంచుతున్నాడంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments