Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడ పరువు హత్య.. పోలీసులు ఏమన్నారో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ప్రణయ్‌ను హత్యచేయించింది.. అమృత తండ్రి, బాబాయ్ అని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఈ హత్

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (09:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ప్రణయ్‌ను హత్యచేయించింది.. అమృత తండ్రి, బాబాయ్ అని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఈ హత్య అమృత తండ్రి మారుతి రావు చేయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు అతడిని ఎ1 నిందితుడిగా, అతడి సోదరుడు శ్రవణ్ ను ఎ2 నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మారుతి రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎస్పీ రంగనాథ్ ఖండించారు. ఈ కేసులో నిందితులెవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవన్నారు.
 
ప్రస్తుతానికి ఆస్పత్రితో పాటు మృతుడి ఇంటి వద్ద వున్న సీసీ కెమెరా రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో వున్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు ఎస్పీ ప్రకటించారు. 
 
కాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమృత వర్షిణి అనే యువతి తన తండ్రిని ఎదిరించి తాను ప్రేమించిన దళిత యువకుడు ప్రణయ్‌ని పెళ్లాడింది. అయితే శుక్రవారం మిర్యాలగూడలో ఓ ఆస్పత్రి వద్ద గుర్తు తెలియని దుండగులు ప్రణయ్‌ని అతి దారుణంగా హతమార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments