Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే రాహుల్ ప్రధాని అవుతారు : సోనియాతో జేసీ దివాకర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు, రాహుల్‌కు పెళ్లి కావాలంటే ఆయన తల్లి సోనియా గాంధీకి కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఓ చిన్నపాటి సలహా ఇచ్చ

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (14:30 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు, రాహుల్‌కు పెళ్లి కావాలంటే ఆయన తల్లి సోనియా గాంధీకి కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఓ చిన్నపాటి సలహా ఇచ్చారట. ఈ చిట్కా కూడా జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో చెప్పారట. ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణుల మద్దతు కావాలని, ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంచి బ్రాహ్మణ అమ్మాయిని చూసి, రాహుల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని సోనియాకు సూచించినట్లు జేసీ తెలిపారు. యూపీలో బ్రాహ్మ‌ణ‌ కమ్యూనిటీదే పైచేయిగా నడుస్తోందని, అందుకే బ్రాహ్మ‌ణ‌ కులానికి చెందిన పిళ్లను రాహుల్‌కు ఇచ్చి పెళ్లి చేయమని గుర్తు చేసినట్లు ఆయన తెలిపారు. 
 
కానీ తన సలహాలు, సూచనలను సోనియా పట్టించుకోలేదని, విని మిన్నకుండిపోయారనీ చెప్పారు. జూలై 4న జరిగిన ఓ కార్యక్రమంలో జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రాయ్‌బరేలీ ఎమ్మెల్యే సదర్ అదితి సింగ్.. కాంగ్రెస్ చీఫ్‌కు ప్రపోజ్ చేసినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే రాహుల్ తనకు సోదరుడిలాంటి వాడని ఆమె ఆ వార్తల్ని కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments