చంద్రబాబుకు ఏమైంది?.. బృందాకారత్ ఫైర్

Webdunia
బుధవారం, 31 జులై 2019 (08:15 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నాయకురాలు బృందా కారత్. దేశంలో దళితులపై దాడులు జరుగుతుంటే 40ఏళ్ళ అనుభవం అంటూ నానా హంగామా చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ విమర్శించారు.
 
40 ఇయర్స్ ఇండస్ట్రీ, తానే సీనియర్ పొలిటీషియన్ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. దళితుల పేరుతో ఓట్లు పొంది వారు సమస్యల్లో ఉన్నప్పుడు పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. వైసీపీది దళితులపై కపట ప్రేమ అంటూ మండిపడ్డారు.దళితుల దాడులపై బిల్లు తీసుకువచ్చే వరకు తాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.  
 
మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన ఆమె మోదీ ప్రభుత్వంపైనా సెటైర్లు వేశారు. స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పాస్‌ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా ఇప్పటికీ చట్టం జరుగలేదని విమర్శించారు. పరువు హత్యలపై ఎందుకు చట్టం చేయలేదో కారణం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments