Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ సమయంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భం నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం నెలకొనివుందని తెలిపింది. 
 
మరోవైపు, ఈ అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికి అందివచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 
 
క్యుమునోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు విదర్భం నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది, సముద్రమట్టానికి 1.5 కిలోమటీర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో వర్షాలు కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments