Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనేతను ధరించి నేతన్నను ఆదరించండి: హోంమంత్రి మేకతోటి సుచరిత

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:40 IST)
చేనేత వస్త్ర ధారణ వల్ల కలిగే విభిన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి నేత కార్మికులను ఆదరించాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాసనసభ లాబీలో ఆప్కో ద్వారా రూపొందించిన నూతన చేనేత డిజైన్లు కలిగిన చీరలను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చేనేత బతుకుల్లో చీకట్లు అలముకున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక చేనేతల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అనతి కాలంలోనే చేనేత పరిశ్రమ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

నేతన్న నేస్తం కింద ఏటా రూ.195  కోట్లు విడుదల చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా నేత కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆప్కో బలోపేతం కోసం కృషి చేస్తున్న చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ను అభినందనీయిలన్నారు.

నూతన ట్రెండ్‌కు అనుగుణంగా యువత, మహిళలు మెచ్చే విధంగా నూతన డిజైనులకు రూపకల్పన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఆప్కో చైర్మన్ గా నాలుగు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి చేనేతల స్థితిగతులను అధ్యయనం చేసి, పాత డిజైన్లకు స్వస్తి పలికి ట్రెండ్ కు అనుగుణంగా నూతన డిజైన్లు రూపొందించాలని, రంగుల వాడకంలోనూ కొత్త ఒరవడిని అవలంభించాలని నేత కార్మికులకు సూచించారు.

తన స్వీయ పర్యవేక్షణలో  అనేక నూతన డిజైన్లకు రూపకల్పన చేసారు. అలా తయారైన చేనేత చీరలకు విస్తృతమైన ప్రచారం కల్పించి చేనేత రంగం, ఆప్కో సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నూతన డిజైన్లతో తయారైన చీరలను హోమ్ మంత్రి సుచరిత చేతుల మీదుగా అందజేసి, వాటి తయారీకి సంబంధించి తీసుకున్న ప్రత్యేక చర్యలను వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments