Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల తరువాత పునరాలోచిస్తాం.. పాఠశాలల నిర్వహణపై ఏపీ విద్యామంత్రి

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:58 IST)
ఒక నెల రోజుల పాటు ఒక పూట మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తామని, తరువాత పరిస్థితి దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 
 
కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ఇది వరకే విద్యార్థులకు బ్యాగులు, యూనిఫారాలు, పుస్తకాలన్నింటినీ సరఫరా చేశామన్నారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడారు. 
 
పారదర్శకంగా, నిజాయితీ, జవాబుదారీ తనంతో పని చేయాలనే.. జగన్మోహన్‌రెడ్డి ఆశయాలను అమలు చేయాలన్నారు. కడప జిల్లాలో 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 805 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. 
 
జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వర్షాలు కూడా పుష్కలంగా కురిశాయని చెప్పారు. 13 రిజర్వాయర్లలో 75 శాతం మేరకు నీటిని నిల్వ ఉంచామన్నారు. 
 
కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా సంక్షేమ పథకాలకు ఏమాత్రం ఢోకా లేకుండా అన్నింటినీ అమలు పరిచామన్నారు. నవరత్నాల్లో లేని పథకాలను కూడా ప్రజలకు అందజేశామన్నారు. 
 
ప్రభుత్వ చీప్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెదేపా చేసిన తప్పిదాలను వైకాపా సరిచేస్తోందన్నారు. పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందంటే తెదేపానే కారణమన్నారు.

గీతం విశ్వవిద్యాయలం గురించి తెదేపా లేని రాద్ధాంతం చేస్తోందన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరని శ్రీకాంత్​రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments