Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరువ్యాపారులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం: జగన్

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (07:57 IST)
చిరు వ్యాపారులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'జగనన్న తోడు' పథకం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలను చూశానని చెప్పారు.

అసంఘటిత రంగంలో ఉన్న వారికి బ్యాంకు రుణాలు కూడా అందడం లేదని అన్నారు. చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి రూ. 10 వేల రుణాన్ని అందించనున్నట్టు జగన్ తెలిపారు.

బ్యాంకు అకౌంట్లు లేని వారికి అకౌంట్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఐదు అడుగులు, అంతకన్నా తక్కువ స్థలంలో ఉన్న షాపులకు... తోపుడు బండ్లపైన, ఫుట్ పాత్ లపైన, గంపల్లో వస్తువులను పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకుని తిరిగే వ్యాపారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు.

గ్రామాల్లో నెలకు రూ. 10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేల ఆదాయం ఉండే వారు ఈ స్కీమ్ కు అర్హులని చెప్పారు. లబ్ధిదారులకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు  జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments