Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం నలుగురమూ నిన్ను గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తాం... మహిళా రిపోర్టరుపై దాడి

రోజురోజుకు జర్నలిస్ట్ లపై పెరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లకు రక్షణ కరువయిందనడానకి తాజాగా జరిగిన ఘటన నిదర్శనం. గుంటూరు జిల్లాకు చెందిన బొమ్మిశెట్టి ఉమాదేవి టీవీ 4 న్యూస్ చానల్లో పనిచేస్తున్నారు. ఆ ఓ కేసు వ్యవహారంపై పోలీసు స్టేషన

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (19:55 IST)
రోజురోజుకు జర్నలిస్ట్ లపై పెరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లకు రక్షణ కరువయిందనడానకి తాజాగా జరిగిన ఘటన నిదర్శనం. గుంటూరు జిల్లాకు చెందిన బొమ్మిశెట్టి ఉమాదేవి టీవీ 4 న్యూస్ చానల్లో పనిచేస్తున్నారు. ఆ ఓ కేసు వ్యవహారంపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో తనపై దాడి చేశారు.
 
ఆమె మాటల్లోనే... ''నాపై దాడి జరిగిందని పోలీసులకు విషయం చెప్పి 15 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగితే, ముద్దాయికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. శుక్రవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో మా ఇంటి లోపలికి నలుగురు ముద్దాయిలు ప్రవేశించి ఇక్కడే మేం నలుగురమూ నిన్ను రేప్ చేస్తాము... చంపేస్తాం అంటూ చెప్పుకోలేని బూతులు తిడుతూ, నా కంఠంపై కత్తితో కోసి నన్ను బలవంతం చేస్తూ చిత్రహింసలు పెట్టారు.
 
కేసు వాపసు తీసుకోకపోతే సామూహిక అత్యాచారం చేసి చంపుతాము అని బెదిరించి, మా ఆటో పగలగొట్టి బీభత్సం చేశారు. నాకు వారితో ప్రాణభయం ఉంది. నన్నేమి చేస్తారో అని భయంగా ఉంది. దయచేసి నాకు అండగా నిలబడాలని జర్నలిస్ట్ సోదరులకు మనవి చేసుకుంటున్నాను'' అంటూ బొమ్మిశెట్టి ఉమాదేవి కన్నీటి పర్యంతమవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం