Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వన్ నేషన్ ... వన్ ఎలక్షన్' : జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధం

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:27 IST)
ఒకే దేశం .. ఒకే ఎన్నికలు.. అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదం. ఈ నినాదాన్ని కార్యాచరణలో పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. 
 
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మిగులుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చపుతున్నారు. భారత్‌కు జమిలి ఎన్నికలు ఎంతో అవసరమని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం స్పందించింది. 
 
జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై పార్లమెంటు సవరణలు చేసిన తర్వాత జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
 
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని ప్రకటించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని... దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుండటం దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments