సోనూసూద్‌కు సిద్ధిపేట చెలిమితండాలో విగ్రహం..

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:25 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో.. వలస కార్మికులకు అండగా వుండిన బాలీవుడ్ హీరో సోనూసూద్ ఆపై పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నటుడు సోనూ సూద్‌ లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి ఏకంగా గుడి కట్టేశాడు. అది కూడా తన సొంత ఖర్చుతో సోనూ సూద్‌కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని. 
 
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాలో సోనూ సూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్‌కు సోనూసూద్‌ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్‌ తమ తండాలో సోనూ సూద్‌ కోసం ఏకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్‌ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anil Ravipudi movie: లాంఛనగా అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, వెంకటేష్ చిత్రం ప్రారంభం

Samantha and Vijay: ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రశంనించిన సమంత రూత్ ప్రభు

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments