Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు కొట్టిన‌ట్లు ఉండాలి, నేను ఏడిసిన‌ట్లుండాలి: ఇద్ద‌రు సీఎంల స్కీం ఇది

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (17:41 IST)
జ‌ల వివాదం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం... వారిద్ద‌రి మూర్ఖ‌త్వం, తెలివిత‌క్కువత‌న‌మే అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమ‌ర్శించారు. ఏపీ సీఎం జ‌గ‌న్, తెలంగాణా సీఎం కేసీయార్‌ల బాధ్య‌తా రాహిత్యం వ‌ల్లే జ‌ల వివాదాలు త‌లెత్తాయ‌న్నారు.

విజ‌య‌వాడ‌లో దేవినేని మీడియాతో  మాట్లాడుతూ, నారుమళ్లకు వెళ్ళవలసిన సాగునీరు సముద్రంలోకి వదలడానికి మీకు మనస్సు ఎలా వచ్చింద‌ని సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌శ్నించారు. నువ్వు కొట్టినట్టు ఉండాలి.. నేను ఏడిసినట్టు ఉండాలి. ఇది ఇద్ద‌రు సీఎంల స్కీమ‌ని చ‌లోక్తి విసిరారు.

ఇలాంటి సమస్య గతంలో వస్తే గవర్నర్ దగ్గర పంచాయతీ పెట్టి 512 టీఎంసీల, 278 టీఎంసీల తెలంగాణ కు మినిట్స్ రాసుకొని సంతకాలు పెట్టామ‌ని దేవినేని వివ‌రించారు. గ‌తంలో కృష్ణా రివర్ బోర్డు పంపకాలు చేసింద‌ని, సాక్షి పత్రిక లో చాలా చక్కగా నీటి పంపకాలు ఇచ్చారు... ఎన్నికల ఒప్పందం లో భాగంగా ఈ డ్రామాలు జరుగుతున్నాయ‌న్నారు. అక్కడ మంత్రులు మాట్లాడుతుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు ?
 
ఇదే 40 ఏళ్ల అనుభవానికి, ఒక తెలివి తక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా అన్నారు. మేము పట్టిసీమ కట్టాము. రాయలసీమ పట్టిసీమ మచ్చుమర్రి కట్టి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చాము. చంద్రబాబు పట్టిసీమ కట్టాడు కాబట్టి, పట్టిసీమ నీళ్లు కృష్ణమ్మకు తీసుకురాలేదు. ఇవాళ కోటి రూపాయలు ఇస్తానంటే, ఒక టీఎంసీ నీళ్లు ఇచ్చే ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో లేవు.
 
పక్క రాష్ట్రంలో మన తెలుగువారు ఉన్నారంటా! మ‌రి, కర్నూలు జల దీక్ష చేసినప్పుడు పక్క రాష్ట్రంలో మన తెలుగు వారు లేరా ? 200 టీఎంసీల అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదు? అధికారంలోకి రాగానే, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ని కలిసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకువస్తానన్నావు ఏమైంది? అని సీఎం జ‌గ‌న్ ని ప్ర‌శ్నించారు. బుద్ది జ్ఞానం ఉంటే ఈ నీళ్లు సముద్రంలోకి కాదు కాలువలోకి పంపించండ‌ని పేర్కొన్నారు దేవినేని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments