Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలిగా ఉందని గదిలోకి తీసుకెళ్లి బాలికపై వాచ్‌మెన్ అత్యాచారం

హైదరాబాద్ నగరంలో బాలికపై అత్యాచారం జరిగింది. చలిగా ఉందని గదిలో పడుకుందామని నమ్మించి గదిలోకి తీసుకెళ్లిన వాచ్‌మెన్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (11:28 IST)
హైదరాబాద్ నగరంలో బాలికపై అత్యాచారం జరిగింది. చలిగా ఉందని గదిలో పడుకుందామని నమ్మించి గదిలోకి తీసుకెళ్లిన వాచ్‌మెన్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
హైదరాబాద్, షాహినాయతగంజ్‌కు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె వయసు 14 యేళ్లు. ప్రతిరోజు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి బేగంబజార్‌లో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఆడుకుంటుంది. 
 
శనివారం కూడా ఆడుకుని ఇంటికి వచ్చింది. భోజనం చేసిన తర్వాత కరెంట్‌ పోయింది. దీంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలిక బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బిడ్డకోసం వెతకసాగారు. 
 
ఇంతలో ఆ బాలికను గమనించిన వాచ్‌మెన్ తులసీరాం యాదవ్‌.. బయట చలిగా ఉంటుంది.. గదిలోకి వెళ్లి పడుకుందామని చెప్పాడు. దీంతో ఆ బాలిక అతనితో కలిసి గదిలోకి వెళ్లింది. ఇదే అదునుగా వాచ్‌మన్‌ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ తర్వాత ఇంటికి పంపించాడు. ఇంటికెళ్లిన ఆ బాలిక ముభావంగా ఉండడంతో ఏం జరిగిందని ప్రశ్నించగా... జరిగిన విషయం చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments