Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడి ముందు.. మరో కోడిని చంపడం నేరం.. ఎలా?

సాధారణంగా ఆదివారం వస్తే చాలు.. చికెన్ షాపుల ముందు జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు. కోళ్లను చంపి మరీ చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీలు చేసుకుని కడుపునిండా లాగించేస్తారు. అంతేనా.. చికెన్ షాపుల ముందు నిలబడి

కోడి ముందు.. మరో కోడిని చంపడం నేరం.. ఎలా?
, శుక్రవారం, 22 జూన్ 2018 (09:06 IST)
సాధారణంగా ఆదివారం వస్తే చాలు.. చికెన్ షాపుల ముందు జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు. కోళ్లను చంపి మరీ చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీలు చేసుకుని కడుపునిండా లాగించేస్తారు. అంతేనా.. చికెన్ షాపుల ముందు నిలబడి మంచి కోడి కొట్టు.. దిట్టంగా ఉండాలి.. ముక్కలు పెద్దవిగా ఉండాలి. ఎముకలు వద్దు.. స్కిన్ వద్దు.. లెగ్ పీస్‌లు వేయండి ఇలా తమ అభిరుచికి తగిననట్టుగా కస్టమర్లు చెబుతుంటారు. దీనికితోడు చవటానికి రెడీగా ఉన్న కోళ్లను చూసి ఆ కోడిని పట్టుకుని కోసివ్వండి... అంటూ చికెన్ షాపు ఓనర్లకు చెబుతుంటారు. నిజానికి ఇలా చేయడం నేరమంటున్నారు హ్యూమన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎండీ జయసింహ, పీపుల్ ఫర్ యానిమల్స్ కార్యకర్త నరేంద్ర ప్రసాద్.
 
దీనిపై వారు స్పందిస్తూ, ఓ కోడి ముందు.. మరో కోడిని చంపటం నేరం, అంతేకాదు కస్టమర్ల ఎదుట కూడా వాటిని కోయటం నేరం. చికెన్ షాపులకు తీసుకొచ్చే కోళ్లకు ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా గ్రిల్స్‌లో రోజుల తరబడి బంధిస్తున్నారు. ఇది మరో ఘోరం అంటున్నారు. ఇది చట్టంలోనే ఉందని.. కానీ ఎవరూ అమలు చేయటం లేదు. జంట నగరాల్లోని చికెన్ షాపు ఓనర్లకు కనీస అవగాహన కూడా లేదు. దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కోడి రక్తం డ్రైనేజీల్లోకి వదలకూడదు. ప్రతి షాపులో సీసీకెమెరా పెట్టాలని.. ఓ జంతువు ముందు.. మరో జంతువును ఎలా చంపుతారని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఏ షాపుకూ లైసెన్స్ లేదని.. ఎవరూ సీసీ కెమెరాలు పెట్టటం లేదన్నారు. కస్టమర్ల ముందు కోడిని చంపటం కూడా నేరం అనే విషయం కూడా తెలియకపోవటం విడ్డూరం అంటున్నారు. శుభ్రత అసలు పాటించటం లేదన్నారు. మొత్తానికి కోడి ముందు.. మరో కోడిని చంపటం నేరం అనే విషయం చాలా మందికి తెలియకపోవటం ఆశ్చర్యం, విడ్డూరంగానే ఉంది కదా… ఇక నుంచి అయినా ఈ రూల్ పాటిస్తారో లేదో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తక్కువ మార్కులొచ్చాయనీ కొడుకుని చంపి తాను కూడా...