Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్’ : ఏపీలో ఇక 'చెత్త పన్ను' - వివరాలు ఇవే..

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (17:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యర్థాల సేకరణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ఈ నెల 15 నుంచి 16 నగరపాలక సంస్థలు, 29 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్‌గ్రేడ్ పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. తర్వాత క్రమంగా దీనిని విస్తరిస్తారు. 
 
‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల సేకరణకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
‘క్లాప్’ అమలు కోసం ఇప్పటి వరకు పాలకవర్గం అనుమతి తీసుకోని చోట వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందాలని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కోచోట, ఒక్కో విధంగా వినియోగ రుసుములు వసూలు చేయనున్నారు.
 
గృహాలకు అయితే నెలకు రూ.120, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే రూ.1,500, బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.3 వేలు, ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటళ్ల నుంచి రూ.15 వేలు, పండ్ల దుకాణాల నుంచి రూ.200, ఫంక్షన్ హాళ్ల నుంచి రూ.4-15 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రూ.750-10 వేలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రూ.500-3 వేలు, చికెన్, మటన్ దుకాణాల నుంచి రూ.300 వసూలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments