Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక... తప్పు చేస్తే ఇక ఇంక్రిమెంట్లు వుండవ్..

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమావళిని ఉల్లంఘిస్తే ‘పునరుద్ధరణకు వీలులేని ఇంక్రిమెంట్‌ను నిలుపుదల’ శిక్షగా పడుతుంది. క్రమశిక్షణా చర్యల కింద నియామకాధికారి ఈ శిక్ష విధించే అవకాశం ఉంది.

విధుల్లో తప్పులు చేసేవారికి తేలికపాటి శిక్షలు (మైనర్‌ పెనాల్టీస్‌), కఠిన శిక్షలు (మేజర్‌ పెనాల్టీస్‌) ఉంటాయి. చేసిన తప్పుల తీవ్రత, ప్రభావం చూసిన అంశాలను పరిగణలోనికి తీసుకుని శిక్షలు అమలు చేస్తారు.

ఉద్యోగి నేర తీవ్రత ఎక్కువగా ఉంటే విధించే అతి కఠిన శిక్షల్లో పునరుద్ధరణకు వీలులేని ఇంక్రిమెంట్‌ను నిలుపుదల (స్టాప్‌ ఏజ్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ విత్‌ క్యుములేటీవ్‌ ఎఫెక్ట్‌) ఒకటి. ఈ శిక్ష పడిన ఉద్యోగికి వార్షిక ఇంక్రిమెంట్‌ను ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు పునరుద్ధరణకు వీలులేకుండా నిలిపివేయవచ్చు.

అంటే శిక్షకు గురైన ఉద్యోగి శాశ్వతంగా ఈ ఇంక్రిమెంట్‌ కోల్పోతాడు. శిక్ష పడిన ఉద్యోగులకు అన్ని అర్హతలు ఉన్నా ఎన్ని సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తే.. అంతకు రెట్టింపు సంవత్సరాలు పదోన్నతి పొందే వీలు ఉండదు. పీఆర్‌సీ అమలు చేసే సమయంలో మిగతావారి కన్నా శిక్ష పడిన ఉద్యోగులకు పే ఫిక్సెషన్‌ తక్కువగా నిర్ధారిస్తారు.

పెన్షన్‌, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌, ఫ్యామిలీ పెన్షన్‌ శిక్ష పడిన ఉద్యోగులకు తక్కువగా నిర్ధారిస్తారు. ఇలాంటి కాల పరిమితి శిక్షలన్నీ తప్పు చేసిన ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి వర్తిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments