Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (14:56 IST)
త‌న సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో కుప్పం బ‌య‌లుదేరారు. ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు రాక నేపథ్యంలో ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని రాళ్లబూదుగూరుకు వద్దకు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు చేరుకున్నారు. టీడీపీ అధినేతను పూలు చ‌ల్లి  స్వాగతించారు. 
 
అనంతరం భారీగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు రాకతో రహదారులు పసుపుమయం అయ్యాయి. రెండు రోజుల పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో కూడా చంద్ర‌బాబు ప్ర‌సంగించ‌నున్నారు.
 
ఏపీలో తెలుగుదేశం నేత‌ల ఇళ్ల‌పై, పార్టీ జాతీయ కార్యాల‌యంపై దాడుల అనంత‌రం నిర‌స‌న‌గా చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష వ‌హించారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు సంఘీభావం తెలుపుతూ, పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలిపారు. అయితే, కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సామాన్య కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాలయానికి రాలేని ప‌రిస్థితుల్లో, సొంత నియోజ‌క‌వ‌ర్గంలో తానే ప‌ర్య‌టించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా ఇపుడు కుప్పంలో ఆయ‌న రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments