Webdunia - Bharat's app for daily news and videos

Install App

35 ఏళ్లు నిండిన వలంటీర్లు ఇంటికే

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:11 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల అమలులో భాగంగా నియమించిన వలంటీర్లకు 35 ఏళ్ల వయసు నిండితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో హడావుడిగా వలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు.
 
50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ఈ సంఖ్య జిల్లాలో 30 వేలకు పైబడే ఉంది. వీరంతా అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే అత్యధికం.
 
రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలు ఉల్లంఘించి వలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి.  35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే 35 ఏళ్లు నిండి వలంటీరుగా పనిచేస్తున్న వ్యక్తులకు సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. 
 
ఈ అంశం కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది.  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి.
 
ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య వందల్లో ఉండే అవకాశం ఉంది.  ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది. నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వలంటీరును ఉద్యోగం నుంచి తొలగింపు చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Charmme : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్

ప్రేమికులను కలిపిన 1990నాటి దూరదర్శన్ కథ

గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న ఆదిత్య ఓం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments