Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

సెల్వి
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (16:38 IST)
విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్నానని వేధించడమే కాకుండా యువతితో పాటు ఆమె తల్లిపై కూడా ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమార్తెకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
వివరాల్లోకి వెళితే... మధురవాడ పోలీస్ స్టేషన్, స్వయంకృషి నగర్‌లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడ్డాయి. యువతితో పాటు ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. 
 
ఈ ఘటనలో తల్లి లక్ష్మి (43) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీపిక డిగ్రీ చదువుకుని ఇంట్లోనే వుంటోంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు మంత్రి ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments