Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణంలో డ్రగ్స్ దందా - ఐదుగురి అరెస్టు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (15:56 IST)
విశాఖపట్టణం నగరంలో డ్రగ్స్ దందా ఒకటి వెలుగు చూసింది. నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించి ఐదుగురు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నలుగురు యువకులు విశాఖకు చెందినవారు కూడా, మరో వ్యక్తి బెంగుళూరు వారి. దిలీప్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ డ్రగ్స్‌దందాకు విశాఖ, గోవాల మధ్య సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అరెస్టు చేసినవారిలో విశాఖకు చెందిన వాసుదేవ, మోజెస్, రవికుమార్, కిశోర్, బెంగళూరుకు చెందిన సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్, ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో దిలీప్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 
 
దీనిపై నగర పోలీస్ కమిషనర్ వివరాలు తెలిపారు. రవికుమార్ గంజాయిని గోవాలో ఉండే దిలీప్ కు అందించేవాడని వెల్లడించారు. దిలీప్ ద్వారా డ్రగ్స్ విశాఖకు తీసుకొచ్చి అమ్మేవారని వివరించారు. ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపులు, డార్క్ వెబ్ ద్వారా విక్రయం జరిపేవారని పోలీస్ కమిషనర్ తెలిపారు. క్రిప్టో కరెన్సీ, యూపీఐ ఆధారిత చెల్లింపుల సాయంతో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments