Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్.జీ.పాలిమర్ కంపెనీ పనైపోయింది, కానీ..

Webdunia
శనివారం, 9 మే 2020 (20:33 IST)
విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. గ్యాస్‌ను పీల్చిన జనం రోడ్లపై కిందపడిపోయారు. ఇక చెట్లయితే మాడి మసైపోయాయి. వందలాది జంతువులు చనిపోయాయి. ఈ ఘటన స్థానికంగా ఉన్న వెంకటాపురం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. తీవ్ర విషాదాన్నే నింపింది.
 
అయితే ఎల్.జి.పాలిమార్ ఫ్యాక్టరీని పూర్తిగా అక్కడ నుంచి తరలించాలన్న డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల 20వేల మంది జనం నివాసముంటున్నారు. నీటి కాలుష్యం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువే. ప్రస్తుతం జరిగిన సంఘటనతో కనీసం నీళ్ళు తాగాలన్నా భయపడిపోతున్న పరిస్థితి స్థానికుల్లో ఏర్పడింది.
 
జరిగిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా ఘటనపై విచారణ జరిపించేందుకు.. ఎల్.జి.పాలిమర్ కంపెనీతో మాట్లాడేందుకు వచ్చారు. అయితే వెంకటాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ తరలించాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
 
ఎల్.జీ.పాలిమర్ కంపెనీని అక్కడి నుంచి తరలిస్తారా లేదా అన్నది ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. అయితే  కంపెనీని మూసివేస్తేనే గ్రామస్తులకు ఎంతో సేఫ్ అన్న భావన అక్కడివారందరూ వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎల్.జీ.పాలిమర్ కంపెనీని ఉన్న ప్రాంతంలో మూసివేసి వేరే ప్రాంతానికి తరలించాలన్న ఆలోచనలో సీఎం జగన్ వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి ముఖ్యమంత్రికి దీనిపై ఒత్తిడి వస్తున్నట్లు కూడా తెలుస్తోందట. అయితే ప్రజల ప్రాణాలే ముఖ్యమని నిర్ణయించుకున్న సిఎం ఫ్యాక్టరీని తరలించేందుకే ఎక్కువ మ్రొగ్గు చూపే అవకాశాలున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments