Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ గ్యాస్ లీక్.. మానవ తప్పిదమే కారణం: ఫోరెన్సిక్

Webdunia
సోమవారం, 11 మే 2020 (21:35 IST)
విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ కి మానవ తప్పిదమే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. లాక్ డౌన్ సందర్భంగా మెయిన్ టెనెన్స్ లో నిర్లక్ష్యం, మానవతప్పిదాల ఫలితంగానే స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్టు ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం తెలిపింది.

డాక్టర్ సరీన్, టి.సురేష్ నేతృత్వంలో ఈ సంస్థకు చెందిన టీమ్ ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి సాక్ష్యాధారాలు సేకరించింది. స్టెరీన్ స్టోరేజీ ట్యాంక్ లోపల ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్ని మిక్స్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అలాగే 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చూడడంలో అలసత్వం వహించారని ఈ బృందం తమ నివేదికలో పేర్కొంది.

సెల్ఫ్ పాలిమరైజేషన్ ని నివారించేందుకు స్టెరీన్ గ్యాస్ ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్లో కలపాల్సి ఉందని, కానీ లాక్ డౌన్ కాలంలో ఇలా జరగలేదని వివరించారు. సెల్ఫ్ పాలిమరైజేషన్ క్రమంగా మొదలై.. కెమికల్ రియాక్షన్ కి దారి తీసింది..దీంతో 150 డిగ్రీల సెంటీగ్రేడ్ తో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడింది అని ఈ నివేదిక తెలిపింది.

దీనిని వెరిఫై చేయడానికి కంట్రోల్ రూమ్ లో ఒక ఆపరేటర్ ఉండాలని, తాము సైట్ ని పరిశీలించిన రోజున స్టోరేజీ ట్యాంక్ లో టెంపరేచర్ 120 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్  ఉన్నట్టు ఈ బృందం పేర్కొంది. కూలింగ్ ప్రాసెస్ ని కూడా సరిగా నిర్వహించలేదని డాక్టర్ సరీన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments