Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గలీజు పోలీస్'.. యువతిపై లైంగికదాడి ... వీడియోతో 'బెండు'తీసింది

'గజల్' శ్రీనివాస్ లైంగిక వేధింపుల వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. ఇంతలో మరో గలీజు ఖాకీ నిర్వాకం వెలుగు చూసింది. హోటల్ గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడికి యత్నించిన ఖ

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (14:53 IST)
'గజల్' శ్రీనివాస్ లైంగిక వేధింపుల వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. ఇంతలో మరో గలీజు ఖాకీ నిర్వాకం వెలుగు చూసింది. హోటల్ గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడికి యత్నించిన ఖాకీకి ఆ యువతే తగిన విధంగా గుణపాఠం చెప్పింది. విశాఖపట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన ఓ యువకుడు నగరంలోని ఫోర్‌పాయింట్స్‌ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి మలేషియాలో తన ఉద్యోగం వదిలేసి కొద్దినెలల కిందట అదే హోటల్లో పనికి చేరింది. ఏం జరిగిందో ఏమోగానీ ఆ యువతికి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. 
 
దీనిపై ఆ యువతి గత యేడాది నవంబర్‌ 18వ తేదీన త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ త్రీ టౌన్‌ సర్కిల్‌ బెండి వెంకటరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, పారిపోయిన యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు. పంజాబ్‌లోని లుథియానా కోర్టులో హాజరుపరిచిన తర్వాత నగరానికి తీసుకువచ్చి జైలుకు తరలించారు. 
 
అయితే సదరు యువతి తన ప్రియుడిని జైలుకు పంపిస్తే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడేమోనని సీఐ వెంకటరావు వద్ద తన ఆందోళనను వెలిబుచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న సీఐ వెంకటరావు ఈ నెల 28న ఆమె ఉంటోన్న మరో హోటల్‌ గదికి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. 
 
దీంతో ఆమె తెలివిగా వీడియో, ఫొటోలు తీసి నగర సీపీకి మంగళవారం ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో సీఐ వెంకటరావును సస్పెండ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం