Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:08 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. 
 
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈ ఆరోపణల నేపథ్యంలో నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు పోలీసులకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది.
 
 శుక్రవారం రాత్రి పులివెందుల పోలీసులు గంగిరెడ్డిని హైద్రాబాద్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే  ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ పరీక్షలకు కోర్టు అనుమతిని ఇచ్చింది.
 
వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్  రంగయ్య, ఈ కేసులో అనుమానితుడు శేఖర్ రెడ్డిలకు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి  కూడ నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో  నార్కో టెస్ట్‌కు అనుమతి ఇచ్చిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments