Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేసిన వ్యక్తి మత్తులో ఉన్నాడనుకుంది.. ప్రియుడి కోసం పెరట్లోకి వెళ్లింది.. చంపేశాడు?!

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆరేళ్ల పాటు తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటాన్ని సహించలేక వ్యక్తి ఇద్దరిని హత్య చేసిన ఘటన విశాఖలో సంభవించింది.

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (17:06 IST)
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆరేళ్ల పాటు తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటాన్ని సహించలేక వ్యక్తి ఇద్దరిని హత్య చేసిన ఘటన విశాఖలో సంభవించింది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన వంజరి రాముతో సంధ్యారాణి సహజీవనం చేస్తోంది. అయితే సంధ్యారాణి రాంబాబు అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ అనుమానంతో రాంబాబును రాము గునపంతో కొట్టి చంపేశాడు.

తొలి భార్యకు ఆరేళ్ల పాటు దూరంగా ఉంటున్న రాము సంధ్యారాణితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికీ మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా వెదురుపల్లికి చెందిన రాంబాబుతో కూడ సంధ్యారాణి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
 
ఈ విషయం తెలుసుకుని పద్ధతి మార్చుకోవాలని సంధ్యారాణిని మందలించాడు. కానీ వారి ప్రవర్తనలో మార్పురాలేదు. దీనికి తోడు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు రాము-సంధ్యారాణి కలిసి వెళ్ళారు. అదే పెళ్లికి రాంబాబు కూడా రావడంతో రాము అనుమానం మరింత బలపడింది. వీరి ప్రవర్తనపై కన్నేసిన రాము మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు.
 
అయితే రాము మత్తుగా నిద్రించాడని భావించిన సంధ్యారాణి పెరట్లో వేచి ఉన్న రాంబాబు వద్దకు వెళ్ళింది. ఈ విషయాన్ని గమనించిన రాము గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్ళు, ముఖాలపై కసితీరా కొట్టి ప్రాణాలు తీశాడు. వారి కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూస్తే రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో ఉన్నారు. రాము పోలీసులకు లొంగిపోయాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments