Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దళితులకు టీడీపీ సర్కారు వల్ల ఒరిగిందేమీ లేదు: ఎంపీ శివప్రసాద్

డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది.. బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ ప్రశ్నించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శివప్రసాద

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (16:00 IST)
డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది.. బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ ప్రశ్నించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు. దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ప్రశ్నించారు. ఎస్‌సి సబ్ ప్లాన్‌కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. 
 
శివప్రసాద్‌పై చంద్రబాబునాయుడు ఆగ్రహంగా ఉండటం ద్వారా దళితసంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నలు అడిగినందుకే తనపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రశ్నలు లేవనెత్తిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు దళిత సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి.  గడిచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు టీడీపి ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదన్నారు.
 
కాగా, చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్‌ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తర్జనభర్జన పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని శివప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించలేకపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో డ్యామేజ్‌ కంట్రోల్‌ ఎలా చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments