Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత వాలంటీర్ పట్ల సర్పంచ్ సంజీవ్ కులవివక్ష.. నీటి కోసం వెళ్తే..?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (17:41 IST)
విశాఖలోని ఉమ్మవరం గ్రామంలో ఓ దళిత యువతి పట్ల సర్పంచ్ సంజీవ్ కులవివక్ష చూపారు. వాలంటీర్ దళిత యువతిను సర్పంచ్ దూషించారు. ఊరిలో తన ముందు తిరగకూడదని, కనపడకూడదని హుకుం జారీ చేశారు. సర్పంచ్ ఆదేశాలతో దళిత యువతి నీరు కోసం కూడా వేరే బావి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
 
దీంతో ఆ కుటుంబాన్ని ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ యువతి వాలంటిర్ ఎస్‌సీ వర్గంలో పుట్టడం తప్పా అని వ్యాఖ్యానించారు. 
 
వైసీపీ సర్పంచ్ కులం పేరుతో దూషించిన పరిస్థితి వచ్చిందని, సీఎం జగన్ ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు యువతి ఫిర్యాదు చేస్తే ఇంటికి వెళ్లి మరీ బెదరిస్తారా అని మండిపడ్డారు.
 
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments