Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని లోబరుచుకోవాలనుకున్నాడు.. కుదరకపోయేసరికి.. ఏం చేశాడంటే?

వయోభేదం లేకుండా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే వున్నాయి. తాజాగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లోబరుచుకోవాలనుకున్న అతడు.. ఆ ప్రయత్నంలో విఫల

Webdunia
ఆదివారం, 20 మే 2018 (10:43 IST)
వయోభేదం లేకుండా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే వున్నాయి. తాజాగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లోబరుచుకోవాలనుకున్న అతడు.. ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఆ కోపంతో విద్యార్థిని భవిష్యత్తును నాశనం చేయాలని ప్లాన్ వేశాడు. 
 
చివరికి ఏం జరిగిందంటే? విశాఖ జిల్లా ముంచంగిపుట్టులోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగసాయి సత్యమూర్తి.. ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలికపై కన్నేశాడు. ఆమెను తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధించేవాడు. కాదంటే.. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు. కానీ ఆ విద్యార్థిని ఎంతకూ లొంగకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఆమె ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష రాసింది. 
 
కానీ కేవలం రెండు మార్కులే ఆ పరీక్షలో రావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు రీ వెరిఫికేషన్ చేయించారు. రీ వెరిఫికేషన్ చేయించినా అవే మార్కులు పడ్డాయి. ఆపై అనుమానంతో మీ సేవ ద్వారా జవాబు పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకుని చూడగా, జవాబుపత్రం గత సంవత్సరం సప్లిమెంటరీ తేదీతో ఉంది.

దీంతో ప్రిన్సిపాల్ ఈ పని చేసుంటాడని భావించి, విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం