Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి అమ్మఒడి వెరిఫికేషన్‌...

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:22 IST)
అమ్మఒడి క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం నుంచి జరగనుంది. ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ అందజేసిన వివరాలను ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)లు పరిశీలించి వైబ్‌సైట్‌లో శనివారం నాటికి పొందుపరిచారు.

విద్యార్థి, వారి తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు, రేషన్‌ కార్డు వంటి అంశాలను హెచ్‌ఎంలు పరిశీలించారు. తెల్ల రేషన్‌ కార్డు లేని, ఆదాయ పరిమితి మించిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులు రిజెక్టు లిస్టులో పెట్టారు. 
 
హెచ్‌ఎంలు పరిశీలించిన సమాచారం వెబ్‌సైట్‌ ద్వారా మండల విద్యాశాఖ అధికారు(ఎంఇవో)లకు చేరుతుంది. ఎంఇవోలు గ్రామ సచివాలయ విద్య, సంక్షేమ శాఖ అధికారులకు పంపుతారు.

అక్కడి నుంచి గ్రామ వాలంటీర్లు రిజెక్ట్‌ లిస్ట్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబాలతో పాటు, మిగిలిన కుటుంబాలకు వెళ్లి పరిశీలన చేస్తారు. అనంతరం ఆ సమాచారాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది వెబ్‌సైట్‌ ద్వారా ఎంఇవోలకు అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఎంఇఓలు ఈ నెల 5లోపు జరపాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments