Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డు సచివాలయాలను తనిఖీ చేసిన బెజ‌వాడ మున్సిప‌ల్ కమిషనర్

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (19:24 IST)
విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలోని వార్డు స‌చివాల‌యాల‌ను శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. సూర్య‌రావుపేట‌ శ్రీ కర్ణాటి రామ్ మోహన్ రావు మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్ అవ‌ర‌ణ‌లో, బ్ర‌హ్మానంద‌రెడ్డి షాపింగ్ కాంపెక్స్, మారుతి న‌గ‌ర్లో  స‌చివాల‌యల‌ను క‌మిష‌న‌ర్ త‌నిఖీ చేసి, కార్య‌ద‌ర్శుల హ‌జ‌రు ప‌ట్టి, వారి జాబ్ చార్టుల‌ను, డైరీని, ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆర్టీల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా  ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ఉద్దేశ్యంతో వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దానిని కార్య‌ద‌ర్శులు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌ని తెలిపారు.

కార్య‌ద‌ర్శుల వారి జాబ్ చార్టు ఆధారంగా  చేసిన ప‌నిని వెంట‌నే డైరీలో పొందుప‌ర‌చాల‌న్నారు. బ‌య‌ట విధులు నిర్వ‌ర్తించుట‌కు వెళ్లిన‌ప్ప‌డు మూమెంట్ రిజిష్ట‌ర్‌లో పూర్తి వివ‌రాలు రాయాల‌న్నారు. శానిట‌రీ కార్య‌ద‌ర్శులు వార్డులో ప‌ర్య‌టించి డోర్ టు డోర్ చెత్త సేక‌ర‌ణ‌, కాలువ‌లు రోడ్డు శుభ్రం చేయించాల‌న్నారు.

హెల్త్ సెక్ర‌ట‌రీలు ప్రతి ఇంటికి వెళ్లి జ‌ర్వ‌ ల‌క్షణాలు ఉన్నావారిని గుర్తించి, వారి వివ‌రాల‌పై అధికారుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. హెల్త్ సెక్ర‌ట‌రీలు వార్డు ప‌రిధిలో కోవిడ్ ప‌రిక్ష‌లు నిర్వ‌హించ‌డం చేయాల‌న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకములకు సంబంధించి డిస్ ప్లే బోర్డును ప‌రిశీలించి, పలు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments