Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు.. ఇంటి వెనుకనే పాతిపెట్టిన భర్త

విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో

Webdunia
సోమవారం, 15 మే 2017 (09:51 IST)
విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో కుమార్తె మరియమ్మ (30)కు అదేప్రాంతంలో విద్యుత్‌ పనులు నిర్వహించే దుర్గాప్రసాద్‌(35)తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుర్గాప్రసాద్‌ స్థానిక రాజీవ్‌నగర్‌లో నివసించే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరియమ్మ భర్తను నిలదీయడంతో భార్యను భర్త వేధించసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మరియమ్మ నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
 
ఈపరిస్థితుల్లో దుర్గాప్రసాద్‌ భార్యను కలిసి.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని, పూర్తిగా మారిపోయానంటూ నమ్మపలికాడు. దీంతో ఇద్దరూ కలిసి రెండు నెలల క్రితం వాంబే కాలనీలో అద్దెకు దిగారు. రెండురోజుల గడిచిన తర్వాత భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. అదేసమయంలో భార్య అడ్డు తొలగించుకోవాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. 
 
అదనుచూసి ఒకరోజు మరియమ్మ మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటి వెనుక ఖాళీ స్థలంలో ఐదడుగుల మేర గొయ్యి తవ్వి భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు. మరుసటిరోజు ఉదయం తాపీ కార్మికులను పిలిపించి.. ఆ గోతిపై గట్టు నిర్మించాడు. నాటి నుంచి భార్య వివరాలు అడిగిన ఇరుగుపొరుగుకు ఏవో కారణాలు చెబుతూ వచ్చాడు. 
 
కుమార్తె నెల రోజులుగా కనిపించకపోవడంతో మృతురాలి తల్లి కుమారమ్మ శనివారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. అల్లుడిపై అనుమానంగా ఉందని చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments