Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌గా మారిన దుర్గారావు... మోసం చేసిన రాకేష్

విజ‌య‌వాడ‌: హోమో సెక్సువ‌ల్స్ చేసుకున్న పెళ్ళి కూడా పెటాకులై, పోలీసుల చెంత‌కు ఫిర్యాదు వ‌చ్చింది. బెజ‌వాడ పోలీసులు ఇపుడు ఈ వింత కేసుపై త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. పెన‌మ‌లూరుకు చెందిన రాకేష్, ములుగు దుర్గారావు హోమోలుగా 2009లో పెళ్ళి చేసుకుని, 2014 వ‌ర‌క

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (22:12 IST)
విజ‌య‌వాడ‌: హోమో సెక్సువ‌ల్స్ చేసుకున్న పెళ్ళి కూడా పెటాకులై, పోలీసుల చెంత‌కు ఫిర్యాదు వ‌చ్చింది. బెజ‌వాడ పోలీసులు ఇపుడు ఈ వింత కేసుపై త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. పెన‌మ‌లూరుకు చెందిన రాకేష్, ములుగు దుర్గారావు హోమోలుగా 2009లో పెళ్ళి చేసుకుని, 2014 వ‌ర‌కు స‌హ‌జీవ‌నం చేశారు. 2011లో దుర్గారావు లింగ‌మార్పిడి చేసుకుని దుర్గ‌గా మారిపోయాడు. 
 
2014 చివ‌రిలో దుర్గ ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం ముంబ‌యి వెళ్ళింది. ఆ స‌మ‌యంలో రాకేష్ రెండో పెళ్ళి చేసుకున్నాడు. ముంబ‌యి నుంచి తిరిగి వ‌చ్చిన దుర్గ నిల‌దీయండంతో రాకేష్ కాళ్ళబేరానికి వ‌చ్చాడు. నీకు ప‌ది ల‌క్ష‌లు ఇస్తా... న‌న్నొదిలేయ్ అంటూ, ప్రామిస‌రీ నోట్లు రాసిచ్చాడు. గుడ్డిగా న‌మ్మిన దుర్గ త‌ర్వాత రాకేష్ ఫోన్ నెంబ‌ర్లు మార్చేయ‌డంతో తాను మోస‌పోయాన‌ని తెలుసుకుంది. 
 
రాకేష్ తండ్రి కానూరులోని సిండికేట్ బ్యాంక్ మేనేజ‌రుగా ప‌నిచేస్తేన్నాడు. ఆయ‌న్ని క‌లిసి రాకేష్ గురించి ప్ర‌శ్నించ‌గా, నాకే సంబంధం లేదు... అంటూ దుర్గ‌పైనే ఎదురుకేసు పెట్టాడు. బెజ‌వాడ నుంచి వెళ్లిపోయి రాకేష్ ఒంగోలులో కాపురం పెట్టాడ‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని దుర్గ పెన‌మ‌లూరు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ కేసు ఎలా ప‌రిష్క‌రించాలా అని ఇపుడు పెన‌మ‌లూరు పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments