Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బీటెక్ విద్యార్థిని రేప్.. సరిగ్గా పెళ్లికుదిరిన రోజే వీడియో లీక్

విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రేప్ కేసు కీలక ములుపులు తిరుగుతోంది. సరిగ్గా ఈ విద్యార్థిని పెళ్లి కుదిరిన రోజే అత్యాచార వీడియోను వాట్సాప్‌లో షేర్ చేసిన క

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (12:49 IST)
విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రేప్ కేసు కీలక ములుపులు తిరుగుతోంది. సరిగ్గా ఈ విద్యార్థిని పెళ్లి కుదిరిన రోజే అత్యాచార వీడియోను వాట్సాప్‌లో షేర్ చేసిన కామాంధులు... తాము కోరినంత డబ్బుతో పాటు తమ కోర్కె తీర్చకుంటే కాబోయే భర్తకు వీడియోనూ చూపిస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ విద్యార్థిని దిక్కుతోచక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసుల దృష్టికివెళ్లింది.
 
తన స్నేహితుల ఆహ్వానం మేరకు బర్త్‌డే పార్టీకి వెళ్లిన బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు సహచర విద్యార్థులు రేప్ చేసి, వీడియో తీసిన విషయం తెల్సిందే. ఈ ఘటన గతయేడాది ఫిబ్రవరిలో జరిగింది. అప్పటినుంచి వేధిస్తూ, తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చిన కామాంధులు... ఆ యువతికి పెళ్లి కుదిరినప్పటికీ వదిలిపెట్టలేదు. 
 
పైగా, నిశ్చితార్థం జరిగిందన్న విషయం తెలుసుకుని మరింతగా రెచ్చిపోయారు. తామడిగినంత డబ్బిచ్చి, కోరిక తీర్చకుంటే కాబోయే భర్తకు వీడియోలు చూపిస్తామని బెదిరించారని వెల్లడించారు. అంతేకాకుండా, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, బంగారు గొలుసును నొక్కేశారు. తమ వద్ద వున్న వీడియోలు లీక్ చేస్తామని బెదిరించారు. 
 
ఆ తర్వాత తమ ముఖాలను మాత్రం బ్లర్ చేసి... తమ స్నేహితులకు వాట్సాప్‌లో షేర్ చేశారు. ఇలా నానా రకాలుగా వేధించిన ఆ కామాంధులు చివరకు పెళ్ళి కుదిరిన రోజే తమ కోర్కె తీర్చాలనీ లేనిపక్షంలో కాబోయే భర్తకు వీడియోలు చూపిస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... విద్యార్థినిని రేప్ చేసి, వీడియోలు తీసిన కేసులో నిందితులను అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో మరిన్ని విషయాలను వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు విద్యార్థులకు కేసులో ప్రమేయం ఉండగా, వారంతా అమ్మాయిని లైంగికంగా వేధించారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు బెదిరించి డబ్బు తీసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ కేసులో కృష్ణ వంశీ, శివారెడ్డి, ప్రవీణ్ నిందితులని, వీరంతా ప్రస్తుతం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లినా, పోలీసు కంప్లయింట్ ఇవ్వనందుకు వారిపై ఐపీసీలోని నిర్లక్ష్యం (నెగ్లిజన్స్) సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. పలు వాట్స్ యాప్ గ్రూపుల్లో రేప్ వీడియో షేర్ అయి ఉందని, వాటిని తొలగించాలని గ్రూప్ అడ్మిన్ లను కోరామని, తొలగించకుంటే వారిపైనా కేసులు పెడతామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం