Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలు భూమికి భారం: శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్‌లోని మాంగసౌర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చోటుచేసుకున్న నేపథ్యంలో రేపిస్టులపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే

Advertiesment
అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలు భూమికి భారం: శివరాజ్ సింగ్ చౌహాన్
, శుక్రవారం, 29 జూన్ 2018 (17:58 IST)
మధ్యప్రదేశ్‌లోని మాంగసౌర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చోటుచేసుకున్న నేపథ్యంలో రేపిస్టులపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు జీవించే హక్కు లేదన్నారు. అలాంటి వ్యక్తులు భూమికే భారమని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
భోపాల్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు భూమికే భారమన్నారు.  బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినశిక్ష పడేలా చూస్తామని చెప్పారు. నిందితుడిని ఉరితీయాలన్నారు. 
 
ఇలాంటి కేసుల సత్వర పరిష్కారం కోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులకు విజ్ఞప్తి చేశారు. 
 
ఇదిలా ఉంటే.. బెల్లంపల్లికి చెందిన ఓ యువతిపై 2013 ఏప్రిల్‌లో రాజ్ కుమార్, సమీర్ అనే వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్లో వున్న  బాధితురాలిని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో కరీంనగర్‌లోని ఐదో అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిఫ్ట్ ఇస్తానంటే వద్దన్నదని రేప్ చేశాడు... గోవా ట్యాక్సీ డ్రైవర్ ఘాతుకం