Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మార్పుపై తేల్చేసిన విజయశాంతి

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (11:00 IST)
తాను పార్టీ మారుతున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. 
 
అదేసమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి తెరాస ప్రభుత్వ సిద్ధమవుతోందని ఆమె విమర్శించారు. 
 
వార్డుల విభజనలో అవకతవకలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం బరితెగింపు బట్టబయలు అయిందని ఆమె అన్నారు. 
 
విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో విసిగిపోయిన ఆమె పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలను విజయశాంతి కొట్టిపారేశారు. 
 
ఇదిలావుంటే, విజయశాంతి తిరిగి వెండితెరపై కనిపించనున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. లేడీ అమితాబ్‌గా ఆమెకు పేరుంది. తెలంగాణ రాములమ్మగా కూడా ఆమెను పిలుచుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments