పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (17:40 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వైకాపా మాజీ మంత్రి, మాజీ మంత్రి విజయసాయి రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకపుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇరువురు నేతల మధ్య ఈ రకమైన అభినందనలు తెలుపుకోవడం సోషల్ మీడియాలో నెటిజన్లు సరికొత్త చర్చకు దారితీశారు. 
 
మంగళవారం పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. దీంతో విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, దేశానికి సేవ చేసే శక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. 
 
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి వైకాపాకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని విజయసాయి రెడ్డి చెప్పినప్పటికీ భవిష్యత్‌లో ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇపుడు పవన్‌కు విషెస్ తెలపడం ద్వారా మరోసారి ఆయన తన రాజకీయ భవితవ్యంపై చర్చకు అవకాశం ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments