బాబు భార్య దత్తత తీసుకున్న గ్రామంలో చిత్తుగా ఓడిన తెదేపా : విజయసాయి ట్వీట్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:10 IST)
ఏపీలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి కొడాలి నాని, వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత గ్రామాల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ ఎద్దేవా చేస్తే... ఆ ఊరికి, తనకు సంబంధమే లేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఊర్లో కూడా టీడీపీ గెలుపొందిందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు చేస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. 
 
పచ్చ కుల మీడియాలో అసత్య వార్తలు వేయించినంత మాత్రాన పంచాయతీలను టీడీపీ గెలుచుకున్నట్టేనా? అని ప్రశ్నించారు. మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారని అన్నారు. మీ అత్తగారి జిల్లాలో కూడా వైసీపీ ప్రభంజనమే బాబూ అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments